పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఉదయం 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గత సంవత్సరం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదయిందని వారు వెల్లడించారు. శీతల గాలులతో చాలా ప్రాంతాలలో పొగ మంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.