నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ 'మాక్ డ్రిల్'
GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం తెల్లవారుజామున ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. డెల్టా టీమ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.