VIDEO: 'అక్రమ అరెస్ట్‌లను ఖండించాలి'
NTR: నందిగామలో అంగన్వాడీ వర్కర్స్ ఎండని సైతం లెక్క చేయకుండా నిరసనను తెలియజేశారు. గాంధీ సెంటర్ నుంచి రైతుపేట లక్ష్మీ ప్రసన్న థియేటర్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైటాయించారు. కనీస వేతనం పెంచమని అడిగినందుకు చేసిన అక్రమ అరెస్ట్‌లను ఖండించాలంటూ, రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరి నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గోపాల్ పాల్గొన్నారు.