రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

SRD: కల్హేర్ మండలం కృష్ణపూర్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్డి గ్రామానికి చెందిన భూమయ్య (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. టీవీఎస్ బైక్‌పై వెళ్తున్న భూమయ్యను ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని ఆటో బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.