2వ అంతస్తు నుంచి పడి ఐదేళ్ల బాలుడు మృతి

WNP: బాల్కనిలో ఆడుకుంటూ ఐదేళ్ల బాలుడు 2వ అంతస్తు నుంచి జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు వనపర్తి జిల్లా బలజపల్లికి చెందిన గురుమూర్తి, నందిని దంపతుల ఐదేళ్ల కుమారుడు. అప్పటి వరకు అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న బాలుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ – అమీన్‌పూర్ పీఎస్ పరిధిలోని పటేల్‌గూడలో జరిగింది.