'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ హక్కులపై కూడా అవగాహన ఉండాలని చెప్పారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి జీవించే హక్కు కల్పించిందన్నారు.