ఎమ్మెల్యే ఆదేశాలతో వైద్య శిబిరం ఏర్పాటు

ఎమ్మెల్యే ఆదేశాలతో వైద్య శిబిరం ఏర్పాటు

కృష్ణా: దావజీగూడెం SC, BC ప్రభుత్వ బాలికల హాస్టళ్లలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం తనిఖీల్లో భాగంగా ఆదేశాల ఇచ్చారు. ఈ మేరకు గన్నవరం CHC వైద్య బృందం బుధవారం సమగ్ర వైద్య శిబిరం నిర్వహించింది. బాలికల బరువు, రక్తహీనత, కళ్ల చూపుతో పాటు సాధారణ ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి అవసరమైన మందులు, టానిక్స్ ఉచితంగా అందించారు.