పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కమిషనర్

KMM: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ అన్నారు. మంగళవారం సత్తుపల్లిలోని డ్రైనేజీ కాలువల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను కమిషనర్ అధ్వర్యంలో తొలగించారు. అనంతరం కమిషనర్ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు నివారణకు ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.