VIDEO: 'కళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి'
SKLM: ఆమదాలవలస కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి. ధనుంజయ రావు ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థలం దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కళాకారులను గుర్తించి గౌరవించాలని అన్నారు. అలాగే, రంగస్థల కళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.