నందలూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
అన్నమయ్య: నందలూరు మండల వ్యాప్తంగా శనివారం నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా నందలూరులో జనసేన పార్టీ నాయకులు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్ డి. సునీల్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు.