గండి పోచమ్మ దర్శనాలు తాత్కాలిక నిలిపివేత
పోలవరం జిల్లా దేవీపట్నంలోని గండి పోచమ్మ ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో లక్ష్మి కుమార్ తెలిపారు. పోలవరం గేట్ల మూసివేతతో గోదావరి నీరు ఎగదన్ని ఆలయం మునిగిపోయింది. ప్రస్తుతం నీరు తగ్గడంతో ఆలయాన్ని శుభ్రం చేస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకు దర్శనాలు ఉండవని, భక్తులు సహకరించాలని ఈవో కోరారు.