పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: నందిగామ పట్టణం మార్కెట్ యార్డులో పత్తి రైతుల ప్రయోజనార్థం సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పత్తిని విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఎక్కడా అసౌకర్యం, అసంతృప్తి కలగకుండా పత్తి కొనుగోలు జరగాలన్నారు.