'మంచినీటి పైప్ లైన్ లీకేజీలను అరికట్టండి'

'మంచినీటి పైప్ లైన్ లీకేజీలను అరికట్టండి'

W.G: పాలకొల్లు పట్టణంలో దేశాలమ్మ గుడి నుంచి రెల్లి వీధికి వెళ్లే మార్గంలో రోడ్డు కింద ఉన్న మంచినీటి పైప్‌లైన్ పగలిపోవడంతో తాగునీరు లీకేజీ అయి వృథాగా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని చాలాచోట్ల పైప్‌లైన్ లీకేజీలు అవుతున్నాయని మున్సిపల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేస్తున్నారని అంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.