విశాఖ రైల్వేస్టేషన్‌లో ఫ్లాగ్‌ మార్చ్‌

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఫ్లాగ్‌ మార్చ్‌

VSP: విశాఖ వాల్తేరు డివిజన్ పరిధిలోని రైల్వే స్టేషన్లలో శాంతిభద్రతలను కాపాడటానికి, నేరాలను నిరోధించడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ శనివారం నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలను బలోపేతం చేస్తూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డివిజన్‌లోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిందని రైల్వే అధికారులు తెలిపారు.