VIDEO: ప్రభుత్వ పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవం
NLR: విడవలూరు మండలంలోని వావిళ్ళ జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం మౌలానా అబుల్ కలాం జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చెంచు రామయ్య, తదితరులు పాల్గొన్నారు.