రోడ్డు ప్రమాదంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మృతి
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శుక్రవారం నేరడిగొండ మండలం కుప్టిఘాట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లక్ష్మణ్ మృతి పట్ల మాజీ ఎంపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.