గోశాలకు తాగునీటి బోరు ఏర్పాటు

KDP: సిద్ధవటం మండలంలోని శాఖరాజుపల్లె పంచాయతీ మొహిద్దిన్ సాహెబ్ పల్లె గ్రామ సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి గోశాల ట్రస్టుకు రూ.2 లక్షల వ్యయంతో మంచినీటి బోరు మోటారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోశాల ట్రస్టు అధినేత లక్ష్మీ నరసింహ స్వామి తాగునీటి బోరు ఏర్పాటుకు సహకరించిన దాతలకు ఆదివారం సత్కరించి టీటీడీ ప్రసాదాన్ని అందజేశారు.