వినూత్న రీతిలో వివాహ వేడుకలు

వినూత్న రీతిలో వివాహ వేడుకలు

ASR: పెదబయలు మండలం కొరవంగి గ్రామానికి చెందిన చిన్నారావు, సునీల్ అనే అన్నదమ్ములు శనివారం వినూత్న రీతిలో తమ వివాహాలు చేసుకున్నారు. పెళ్లి అంటే మండపంలో దేవుళ్ల ఫొటోలు, వేద మంత్రాలు, మేళతాళాలు ఉంటాయి. కానీ వీరు కులమతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్నారు. మండపంలో బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ దంపతుల ఫోటోల సాక్షిగా తమ వివాహాలు చేసుకున్నారు.