జిల్లాకు భారీ వర్ష సూచన

జిల్లాకు భారీ వర్ష సూచన

GNTR: జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు చెట్ల కింద ఆశ్రయం పొందకూడదని, సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. విద్యుత్ స్తంభాలు, ఇనుప కంచెలకు దూరంగా ఉండాలని కోరారు.