'భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి'

'భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలి'

ASR: జీ.మాడుగుల మండలం వంతాల పంచాయతీ రాచపణుకు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని సర్పంచ్ పద్మ గురువారం కోరారు. గ్రామంలో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వీరికి పాఠశాల భవనం లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాల భవనం పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించారు.