'కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉంచాలి'

'కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉంచాలి'

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇంఛార్జ్ కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్ట పైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.