ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వంశీకృష్ణ సూచించారు. బల్మూరు మండలం కొండనాగులలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలని, రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందిస్తామని తెలిపారు.