ట్రాన్స్ పోర్టు కార్యాలయాలపై GST దాడులు..!
KDP: జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశి, పెనాల్టీ విధించారు.