VIDEO: విఘ్నేశ్వరుని ఆలయంలో భారీగా అక్షరాభ్యాసాలు
కోనసీమ: అయినవిల్లిలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయకుని ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. పాల్గుణ మాసం బహుళ ఏకాదశి శుభదినం కావడంతో అధిక సంఖ్యలో చిన్నారులచే అక్షరాభ్యాసం, అన్న ప్రాసన్నలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం చిన్నారులతో సందడిగా మారింది. స్వామివారి ముఖ మండపంలో కూడా భారీగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు.