'ప్రజలలో HIV గురించి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత'
HNK: ప్రజలలో HIV గురించి నిరంతరంగా అవగాహన కలిగిస్తూ అపోహలు తొలగించడం, చైతన్యవంతులను చేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని HNK ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి డా.కె. పట్టాభిరామారావు అన్నారు. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా భద్రకాళి ఆర్చి నుంచి NRI ఆడిటోరియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిని ఆయన DMHO డా. అప్పయ్యతో కలసి జెండా ఊపి ప్రారంభించారు.