సుగాలి మిట్టలో ఉచిత వైద్య శిబిరం
CTR: మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముడిపాపనపల్లిలో వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా పుంగనూరు మండలం సుగాలిమిట్ట శుక్రవారం 'స్వస్థ నారి సశక్తి పరివార అభియాన్' వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో టీబీ, షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.