రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి.. హైవేపై మైక్‌లతో అలెర్ట్‌

రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి.. హైవేపై మైక్‌లతో అలెర్ట్‌

KKD: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. జగ్గంపేట సర్కిల్ పరిధిలో హైవే మొబైల్ వాహనాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనదారులను నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు సీఐ వై.ఆర్‌.కే. శ్రీనివాస్‌ తెలిపారు. వాహనచోదకులు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.