నేడు కోటప్పకొండ ఆలయం మూసివేత

నేడు కోటప్పకొండ ఆలయం మూసివేత

PLD: చంద్రగ్రహణం కారణంగా నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయాన్ని నేడు మధ్యాహ్నం 1:30 నుంచి మూసివేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర రావు తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, శుద్ధి అనంతరం 8 గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.