ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్
HNK: ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పేయ్ అన్నారు. మంగళవారం దామెర మండలంలోని PHCలో 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో స్త్రీలు, జనరల్ మెడిసిన్, ఎముకలు కీళ్లు, కంటి, దంత, పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.