వైఎస్సార్ విగ్రహంపై దాడి

ATP: ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు.