నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఈరోజు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్‌కో ఏఈ శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లకు ఆనుకుంటున్న చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపడుతున్నందున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.