కొనుగోలు కేంద్రం ప్రారంభం
PDPL: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏఎంసీ ఛైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, సర్పంచ్ గన్నేరం వసంత నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లవేని రమేశ్, మార్కెటింగ్ డైరెక్టర్ కేతిరెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.