జలాశయాల్లో తగ్గిపోతున్న నీరు
TG: రాష్ట్రంలో జాలాశయాలు డెడ్ స్టోరేజ్‌కు చేరుతున్నాయి. దీంతో వర్షాలు సకాలంలో పడకపోతే తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలంలో కేవలం 43.75 TMCలు, నాగార్జున్ సాగర్‌లో 176.06 టీఎంసీలు, శ్రీరాంసాగర్‌లో 28.85 టీఎంసీలు, సింగూరు, జూరాలలో 7.46, 4.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.