ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు: కలెక్టర్
SRPT: సూర్యాపేట జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 280 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని, అక్కడ రైతులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని సూచించారు.