డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా..!
KMR: బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. టాస్క్, ఐక్యూఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, టీమ్ మేనేజర్ పోస్టులకు ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులని ప్లేస్‌మెంట్ సెల్ కన్వీనర్ డా. అశోక్ రావు పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.