VIDEO: గుర్లలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
VZM: గుర్ల మండలం గరికివలస గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గురువారం స్థానిక గ్రామంలో ఎడ్లు బండిలో చిన్న పెద్ద అంతా ఎక్కి గ్రామం అంతా తిరిగారు. అనంతరం ఎడ్లు బండి పోటీలు నిర్వహించారు. దీంతో గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంది. తెలుగు సాంప్రదాయాలను పాటిస్తున్న ఈ గ్రామస్తులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.