VIDEO: జిల్లా కలెక్టరేట్‌లో ' సామూహిక వందేమాతరం'
NZB: బంకించంద్ర ఛటర్జీ 'వందేమాతరం' జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో వందేమాతరం గేయాన్ని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సామూహికంగా ఆలపించారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్ పాల్గొన్నారు.