బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెండ్
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ బాలికల వసతి గృహం వార్డెన్ చంద్ర కుమారి విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తుందని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ రాజాబాబు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ వెల్లడించారు. విద్యార్థినులను సెలవులపై పంపించే సమయంలో ఒంటరిగా పంపిస్తున్నారనే ఆరోపణలపై విచారణ నిర్వహించి, సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.