నంద్యాలలో జాబ్ మేళా..!

నంద్యాలలో జాబ్ మేళా..!

నంద్యాలలోని PSC & KVSC ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్.శశికళ ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు నోడల్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ మేళా జరుగనుంది. 10 కంపెనీలు పాల్గొననున్న ఈ మేళాకు పదో తరగతి పైగా చదివిన వారు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.