ప‌ట్టు పురుగుల పెంప‌కంతో రైతుల‌కు లాభాలు: క‌లెక్ట‌ర్

ప‌ట్టు పురుగుల పెంప‌కంతో రైతుల‌కు లాభాలు: క‌లెక్ట‌ర్

NLG: పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ అన్నారు. జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని రకాల అనుకూలమ‌ని కలెక్టర్ అన్నారు. బుధవారం కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టు పురుగుల పెంపకం కేంద్రాన్ని అయన సందర్శించారు.