నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ASF: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం వాంకిడి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని, నామినేషన్ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరినే లోపలికి అనుమతించాలని సూచించారు.