ఊరగుట్టను గ్రామానికి కేటాయించాలని వినతి
JGL: భీమారం మండల కేంద్రంలోని 'ఊరగుట్ట' అటవీ శాఖ భూమిని గ్రామానికి కేటాయించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు గ్రామ నాయకులు విన్నవించారు. బుధవారం కోరుట్లలో ఎమ్మెల్యేను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ అవసరాల దృష్ట్యా సదరు భూమిని కేటాయించేలా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సంజీవ్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు