నిరుద్యోగుల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించిన ఎంపీ
WGL: వరంగల్ పార్లమెంట్ పరిధిలో నిరుద్యోగుల సమస్యలను పార్లమెంటులో ఎంపీ కడియం కావ్య ప్రస్తావించారు. పరిశ్రమల కొరత, వ్యవసాయ ఆధారిత ఉపాధి సీజనల్‌గా ఉండటం వల్ల యువత వలసలు ఆగడం లేదని పేర్కొన్నారు. వరంగల్ ప్రాంతానికి ప్రత్యేక పరిశ్రమలు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ అన్నారు.