'జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి'
PPM: జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టాలి అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మన్యం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పశు సంవర్ధక శాఖ భవనాల ఏర్పాటు, మరమ్మతులకు నాబార్డ్ నుంచి నిధులు విడుదలకు కృషి చేస్తా అన్నారు. రానున్న సోమవారం నుంచి శనివారం వరకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులతో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించాలని సూచించారు.