మీడియాపై మండిపడిన సీఎం
కర్ణాటక కేబినెట్ మార్పులు, చేర్పులపై ఈ నెల 15న ఢిల్లీకి వెళ్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అగ్రనేతల సూచనలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా సీఎం మార్పు గురించి సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నించగా మండిపడ్డారు. అడిగేందుకు మీ వద్ద వేరే ప్రశ్నలు లేవా అంటూ ఊగిపోయారు. సీఎం మార్పుపై సోనియా, రాహుల్, ఖర్గే ఎవరైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.