ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. దారిమళ్లింపు

ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు.. దారిమళ్లింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించారు. జెడ్డా నుంచి HYDకి వస్తున్న విమానంలో మానవ బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చింది. 1984లో మద్రాస్ విమానాశ్రయంలో జరిగిన తరహాలో ఈ దాడి జరుగుతుందని దుండగులు హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని ముంబైకి తరలించారు. అయితే దీనిపై ఇండిగో ఇప్పటివరకు స్పందించలేదు.