'కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు అభివృద్ధి'

'కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు అభివృద్ధి'

KKD: ఆంధ్ర రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు పోటీ పడుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడలోని మదర్ తెరిసా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో బుధవారం నిర్మించిన ఆదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు.