ఎంపీ పురందేశ్వరిని కలిసిన ఎమ్మెల్యే ముప్పిడి
E.G: రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. టౌన్‌లో యానాదుల కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ. 40 లక్షల విలువైన ప్రతిపాదనలు ఎంపీకి సమర్పించారు. కాలనీలో ప్రజలకు అవసరమైన కమ్యూనిటీ సదుపాయాలు అందించాలనే ఆకాంక్షతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తునట్లు ఆయన పేర్కొన్నారు.