పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ కలెక్టర్

పల్నాడు: నూజండ్ల మండలం పాత చెరుకుంపాలెం గ్రామంలో అంగన్వాడి స్కూలు, ఎంపీపీ పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్(పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్) వరదా సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల భోజన సదుపాయాలు, రికార్డులను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ, శానిటేషన్ గురించి పంచాయతీ కార్యదర్శి చిట్టిబాబుకు పలు సూచనలు చేశారు.