పాక్ మహిళతో పెళ్లి.. మోదీనే న్యాయం చేయాలి!

పాకిస్తాన్ మహిళను పెళ్లాడిన విషయాన్ని రహస్యంగా ఉంచడమే కాకుండా వీసా గడువు ముగిసినా ఆమెను రహస్యంగా ఇక్కడే ఉంచిన మునీర్ అహ్మద్ అనే జవాన్‌ను సీఆర్పీఎఫ్ అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. పాక్ మహిళను పెళ్లి చేసుకున్నట్లు అధికారులకు చెప్పలేదనడంలో నిజం లేదన్నాడు. కావాలనే ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు, ప్రధాని మోదీనే తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.